కరోనా కారణంగా తల్లి, లేదా తండ్రి, లేదా ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు ఏపీలో 6800మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం వీరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అయితే ఇప్పటి వరకు అధికారులు వీరిలో 4033మంది వివరాలను మాత్రమే సేకరించగలిగారు. ఇందులో 1659మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చదువుతున్నట్టు గుర్తించారు. మిగతా వారిలో 2150మంది ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నట్టు తెలిసింది. 524 మంది స్కూల్ వయసురాని చిన్నారులుగా తేల్చారు.