విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో యువతి రాములమ్మపై పెట్రోలుపోసి నిప్పుపెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సీఎం కు వివరించారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగిందని.. బాధితులు ఫోన్ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించారని అధికారులు సీఎంకు తెలిపారు. దాంతో బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించాలని సీఎం ఆదేశించారు.