మూడు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఇందిరా శోభన్ ని "మీరేం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా" అంటూ కాస్త ఘాటుగా హెచ్చరించారు షర్మిల. అందరి ముందు అలా మైక్ లో ఆ స్థాయి లీడర్ ని కించపరిచేలా మాట్లాడటంతో చాలామంది షాకయ్యారు. ఆ తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా ఓ యూట్యూచ్ ఛానెల్ ఆ వీడియోని అంతవరకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఇందిరా శోభన్ అభిమానులంతా రెచ్చిపోయారు.