వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఒకటో రోజు, రెండో రోజు.. యాభయ్యో రోజు, 75వ రోజు.. ఇలా కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు ఏం తేలింది అంటే.. పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. దీంతో చివరాఖరుకు సీబీఐ ఓ పత్రికా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో సరైన సమాచారం ఇచ్చినవారికి రూ.5లక్షలు బ హుమానం ఇస్తామని సీబీఐ పేర్కొంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది. సాధారణ ప్రజలనుంచి కూడా ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని సూచించింది. ఎస్పీ, డీఎస్పీలకు వివరాలు తెలియజేయాలంటూ వారి ఫోన్ నెంబర్లను కూడా పేపర్ ప్రకటనలో ఇచ్చింది.