ఆడియో టేపులు వైసీపీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవహారాన్ని జనం ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అనుకుంటున్నారు ఆయా నేతలు. అంబటి రాంబాబు ఓ చిన్న వీడియో మెసేజ్ రిలీజ్ చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అవంతి శ్రీనివాస్ కూడా అంతే.. చిన్న వివరణ ఇచ్చి ఆగిపోయారు. దాని వెనక ఎవరున్నారు, ఎందుకు కుట్ర చేశారు, ఎవరు చేశారు అని వారు ఆరా తీయలేదు, తీయాలనుకోలేదు, ఆ విషయాలను పెద్దవి చేయాలనుకోలేదు.