కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాదయాత్రలో సీఎం కేసీఆర్..టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం పని చేస్తున్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాలని ప్రధాని మోడీ శ్రమిస్తున్నారని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్య మంత్రి సీఎం కెసిఆర్ మాత్రం ఫాంహౌస్ లో ఉంటాడో ప్రగతిభవన్ లో ఉంటాడో అర్థం కాదని వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ప్రజలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో సెక్రటేరియట్ కి రాని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేసీఆర్ మాత్రమే అని కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.