రాజమండ్రి టీడీపీ అనగానే మొదట గుర్తొచ్చే పేరు...సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరీదే. తెలుగుదేశం పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. ముఖ్యంగా రాజమండ్రికి అనేక ఏళ్లుగా సేవ చేస్తూ వస్తున్న నాయకుడు. ఇలా రాజమండ్రిలో కీలకంగా ఉన్న బుచ్చయ్యకు నిదానంగా టీడీపీలో ప్రాధాన్యత తగ్గుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ తప్పులు చేస్తుందని ఎక్కడకక్కడ హెచ్చరిస్తూ వస్తున్న బుచ్చయ్యని, చంద్రబాబు సైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే గౌరవం లేని పార్టీలో తాను ఉండలేనని, పార్టీ నుంచి తప్పుకోవడమే గాక, శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని బుచ్చయ్య మాట్లాడుతున్నారు.