కొడాలి నాని, వల్లభనేని వంశీ...అధికార వైసీపీలో ఫైర్‌బ్రాండ్ నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలి మీద వెళుతూ, ఆయనపై విమర్శల దాడి చేస్తారు. పైగా ఇద్దరు నాయకులకు టీడీపీలోనే బాగా ఫాలోయింగ్ వచ్చింది. కానీ అలాంటి నాయకులని ఎంకరేజ్ చేసిందే చంద్రబాబు అని, టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ మాట్లాడుతున్నారు. మొదట నుంచి పార్టీలో ఉన్న నాయకులని పట్టించుకోకుండా మధ్యలో వచ్చిన నాయకులని అందలం ఎక్కిస్తే, వారే చివరికి చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి, చంద్రబాబునే తిడుతున్నారని అంటున్నారు.