దేశవ్యాప్తంగా 1.33 లక్షలమందికి బ్యాంకులు కరోనా లోన్లు ఇచ్చాయి. ఈ లోన్లు ఇచ్చే వ్యవహారంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులోని ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకులు మొత్తం 33,917 మందికి కొవిడ్ లోన్లు ఇచ్చాయి. ఆ తర్వాత కర్నాటక 20,391మందికి కొవిడ్ లోన్లు ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర.. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీ ఎక్కడ ఉందా అని ఆరా తీస్తే.. చివరి స్థానం దక్కింది. ఏపీలో కొవిడ్ లోన్లు తీసుకున్న వారి సంఖ్య కేవలం 2,791 మాత్రమే.