అక్క చెల్లెల్లు అడగాలే గానీ రాఖీ పండగ రోజు అన్నదమ్ములెవరైనా సోదరీమణులు కోరుకున్నదేదైనా ఇచ్చేయాల్సిందే. కనీసం హామీ అయినా పుచ్చుకోనిదే అక్కచెల్లెల్లు వెనక్కి తగ్గరు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ తో రాఖీ పండగ రోజు సీఎం జగన్ ని కలసి ఆయనకు తొలి రాఖీ కట్టారు చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని. మహిళా కోటాలో మంత్రి పదవి రేసులో ముందున్న ఆమె ఇలా రాఖీ విషయంలో కూడా తాను ముందున్నానని నిరూపించుకున్నారు.