హుజూరాబాద్‌లో గెలిచేందుకు కేసీఆర్ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ఈటల నైతికంగా గెలిచాడని ఎందుకు అంటున్నామో అర్థం అవుతుంది. నిన్నటి వరకు తనతో కలిసి నడిచిన ఈటల ఓటమికి కేసీఆర్ నానా హైరానా పడుతున్నట్టు కనిపిస్తోంది. జిల్లా యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లో తిష్ట వేసి టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఇక హరీశ్ రావు నేతృత్వంలోని పార్టీ బృందం కూడా ఇప్పటికే ప్రచారం ఉధృతం చేసి హంగామా చేస్తోంది.