అఫ్గానిస్తాన్‌కు సైన్యం నిర్వహణ కోసం అమెరికా నుంచి ఫండ్స్ విపరీతంగా వచ్చేవి.. తన భద్రత కోసం ప్రతిష్ట కోసం అమెరికా అఫ్గాన్ సైన్యాన్ని పోషించింది. మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. అఫ్గాన్ ప్రభుత్వానికి పంపింది. కానీ.. అఫ్గాన్ సైన్యం అధికారులు మాత్రం లంచాలు మెక్కి.. తప్పుడు లెక్కలు చూపేవారు. సైన్యానికి శిక్షణ ఇస్తున్నాం.. టెక్నాలజీ ఇస్తున్నాం.. అంటూ లెక్కలు రాసేసి డాలర్లు మింగేసేవారు.