ప్రస్తుతం ఈటల కేసులపై ఉన్న అప్ డేట్ ఏంటి..? టీఆర్ఎస్ నుంచి ఆయన్ను బయటకు పంపించే క్రమంలో అధికారులు చూపించిన ఉత్సాహం ఇప్పుడెందుకు చూపించడంలేదు. అసలు భూ కబ్జా జరిగిందా లేదా..? ఈ విషయాలని హైలెట్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త లాజిక్ తీశారు. అసలు ఈటలపై చర్యలు తీసుకోవడం కేసీఆర్ కి ఇష్టం లేదని, అందుకే ఆయన సైలెంట్ అయ్యారని, అధికారుల్ని సైలెంట్ గా ఉండమన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. కేవలం ఈటలను పార్టీనుంచి బయటకు పంపేందుకే భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు.