24 గంటలు పనిచేసే ఏటీఎం సెంటర్ల మాదిరిగా తమిళనాడులో 24గంటలు పనిచేసే వ్యాక్సినేషన్ సెంటర్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు ఈరోజునుంచి పనిచేస్తాయి. వృత్తి, ఉపాధి పనిమీద బిజీగా ఉండేవారికోసం 24గంటలు ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. అంతే కాదు, 80ఏళ్లు పైబడినవారికి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచి, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు తెలిపారు తమిళనాడు అధికారులు.