ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి గ్రూప్ పేరిట ఓ సర్వే హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని, ప్రతిపక్ష టీడీపీ పుంజుకుందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరుపున 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే చెబుతోంది. అలాగే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టఫ్ ఫైట్ ఎదురుకుంటారని సర్వేలో తేలింది.