ఏపీలో పలువురు మంత్రులకు వ్యతిరేక గాలులు వీస్తున్నాయని కొన్ని సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా అధికార వైసీపీలో చాలామంది మంత్రులు రెండేళ్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కూడా విఫలమవుతున్నారని, అలాంటి వారిని జగన్ నెక్స్ట్ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని కథనాలు వస్తున్నాయి. అలాగే వారు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది.