టిడ్కో ఇళ్లను ఇంకా టీడీపీ ప్రభుత్వానికి చెందిన పనులుగానే భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వాటిని లబ్ధిదారులకు ఇచ్చే లోగా జగనన్న కాలనీలు పూర్తవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయింది. అక్కడ నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకుని చేపట్టే నిర్మాణాలు అక్టోబర్ నాటికి మొదలు పెట్టాలని తాజా సమీక్షలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో జరిగే నిర్మాణాలు కూడా త్వరలో పూర్తవుతాయని అంటున్నారు. మొత్తమ్మీద టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చే లోగా, జగనన్న కాలనీల్లో గృహప్రవేశాలు జరుగుతాయనమాట.