తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 2500మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎర్న్ డ్ లీవ్స్ ద్వారా దాచిపెట్టుకున్న నగదుని విత్ డ్రా చేసుకోలేకపోతున్నారు. ఈఎల్స్ చెల్లింపుని మూడేళ్లుగా నిలిపివేసింది టీఎస్ఆర్టీసీ. నిధులు లేవన్న సాకుతో ఎవరికీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడంలేదు. ఆ బకాయిలు ఇప్పుడు ఏకంగా రూ.100కోట్లకు చేరుకోవడం విశేషం.