దేశవ్యాప్తంగా 363 మంది ఎంపి, ఎంఎల్ఎలపై ఏకంగా కోర్టులే నేరాభియోగాలు నమోదు చేశాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ చెబుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కోర్టులు వీరిపై నేరాభియోగాలు నమోదు చేశాయి. ఈ సంస్థ 2019 నుంచి 2021 వరకు 2,495 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎంఎల్ఎలు దాఖలు చేసిన అఫిడవిట్లు పరీక్షించి ఈ లెక్కలు తేల్చింది.