టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాఖీ పౌర్ణమి తీవ్ర కష్టాలు తీసుకువచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. ఆయన హైదరాబాద్లోనే ఉండిపోవడం అయితే.. మరొకటి.. కాంగ్రెస్తో చంద్రబాబుకు ఉన్న బంధాన్ని ఈ పండుగ ప్రధానంగా బయటకు తీసుకురావడం అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. రాఖీ పౌర్ణమిని చంద్రబాబు రాజకీయంగా సెంటిమెంటుగా భావిస్తారు. ఈ పండుగ రోజు.. (గత ఏడాది కరోనాతో దూరంగా ఉన్నారు) ఆయన నేరుగా విజయవాడకు వచ్చి.. మహిళా నాయకులకు రాఖీ కట్టే ఛాన్స్ ఇస్తారు. తద్వారా. పార్టీలో మహిళా సాధికారతకు తాను పెద్దపీట వేస్తున్నాననే సంకేతాలు ఆయన పంపుతున్నారు.