ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష టీడీపీ నేతలు వరుసగా జైలు పాలవుతున్న విషయం తెలిసిందే. అయితే తప్పు చేస్తే జైలుకెళ్తున్నారా? వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ నేతలని జైల్లో పెడుతుందా? అనే విషయం ఈ పాటికి ప్రజలకు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. అయితే వరుసపెట్టి టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం జరుగుతుంది. కానీ ఇటీవల అరెస్ట్ అయి జైలుకెళ్లి బయటకొచ్చినప్పుడే దేవినేని ఉమా, నారా లోకేష్‌ని సైతం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేశారు.