నవరత్నాల పథకాల అమలుతో ఒకరకంగా ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేశారు జగన్. నెలకోసారి ఏదో ఒక పథకం పేరుతో జనాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. కష్టం వస్తుంది అనుకున్న ప్రతి సారీ జగన్ ఆదుకుంటున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. సచివాలయ వ్యవస్థ కూడా జగన్ కి వెన్నుదన్నుగా ఉంది. ఈ దశలో ప్రతిపక్షం చేష్టలుడిగి చూడటం మినహా చేయగలిగిందేమీ లేదు. అయితే ఇంకా రెండున్నరేళ్లకు పైగా టైమ్ ఉంది. ఆలోగా ప్రజా క్షేత్రంలో దిగి, సమస్యల పరిష్కారం కోసం కృషిచేయగలరు అనే పేరు తెచ్చుకుంటే మాత్రం టీడీపీకి కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది. మరి మిగిలిన రెండున్నరేళ్ల టైమ్ లో లోకేష్ ఏం చేయగలరు, ఎలా చేయగలరు అనేదే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది.