ఈడీ ఆదేశాల మేరకు ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీనటీనటులను... ఇతర రంగాలకు చెందిన వారిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు సాగే అవకాశం కనిపిస్తోంది. ఈడీ దర్యాప్తు అంటే అంత తేలికైంది కాదు.. మరి పోలీసుల తరహాలోనే ఈడీ విచారణ కూడా ఏళ్లకు ఏళ్లు ఏమీ తేల్చకుండా సాగుతుందా.. లేదా త్వరలోనే కేసు ఓ కొలిక్కి వస్తుందా అన్నది చూడాలి.