టీఆర్ఎస్ నాయకులు మరియు రేవంత్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. మంత్రి మల్లారెడ్డి పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఘాటు వ్యాఖ్యలతో రేవంత్ పై మల్లారెడ్డి ఫైర్ అవ్వడంతో రేవంత్ అనుచరులు కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా రేవంత్ పై మరో టీఆర్ఎస్ పీయూసీ చైర్మెన్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అని ఆయన పార్టీలో ఉంటే పార్టీ సర్వనాశనం అవుతుందని పీయూసీ చైర్మెన్ జీవన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు దగ్గర చప్రాసీగా పనిచేసి ఆయనను ఏపీకి పంపించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి టెంట్- స్టంట్- పర్సెంట్- ఆప్సెంట్ డ్రామా ఆపితే మంచిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు- మూటలు- ముఠాలు చేసే వైఖరంటూ మండి పడ్డారు. పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడమే రేవంత్ వైఖరని అన్నారు. ఒక్క మల్లారెడ్డి- మైనంపల్లి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు- వందమంది ఎమ్మెల్యేలు మాట్లాడితే తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పవర్ లోకి రాలేమని ముందే గ్రహించి ఇష్టమొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నారని మండి పడ్డారు.