అఫ్గాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకున్నా.. ఆ వ్యూహాన్ని సురక్షితంగా అమలు చేయలేకపోయింది. వందల మంది తమ పౌరులు ఇంకా అఫ్గాన్‌లో ఉండగానే తన నిర్ణయం ప్రకటించింది. తాలిబన్లకు ఊపునిచ్చింది. ఫలితంగానే ఇప్పుడు ఈ మారణ హోమం. తమపై ఉగ్రదాడులు జరుగుతాయని తెలిసినా తన సైనికులను కాపాడుకోలేని నిస్సహాయ దేశంగా ఇప్పుడు అమెరికా ప్రపంచం ముందు నిలిచింది.