ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నుంచి ఏపీ హెచ్ ఆర్సీని కర్నూలుకు మారుస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు 2017 అక్టోబర్ 24 తేదీన ఏపీ హెచ్ ఆర్సీని విజయవాడలో ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.