హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని సెలవిచ్చారు హరీష్ రావు. కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ప్రధాన పోటీదారు అయిన బీజేపీకి కూడా డిపాజిట్ రాకుండా చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇదే హరీష్ రావు గతంలో దుబ్బాక ప్రజలకు కూడా ఇలాగే పిలుపునిచ్చారు. అప్పుడింకా టీఆర్ఎస్ వైపు సింపతీ ఓటు ఉంది. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. ఈసారి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థే బీజేపీలో చేరి తిరుగుబావుటా ఎగరేశారు. మరి పరిస్థితి పూర్తిగా టీఆర్ఎస్ కి ఎలా అనుకూలంగా ఉంటుంది. గతంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి ఈ సారి డిపాజిట్లు రాకుండా ఎలా పోతాయి..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.