మన దేశ దర్యాప్తు సంస్థలు అడిగితే అక్కడి బ్యాంకులు చెప్పవు. అందుకే ఇంటర్పోల్ సాయం తీసుకుంటున్నారు. డ్రగ్స్ కొనుగోళ్ల చెల్లింపులకు సంబంధించి సిట్ దర్యాప్తులో కొన్ని ఆధారాలు దొరికాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని లావాదేవీల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ నటుల ఈడీ విచారణ పూర్తయితే అప్పుడు అసలు సీన్ మొదలయ్యే అవకాశం ఉంది.