మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 40వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దాంతో కరోనా కట్టడిపై కేంద్రం మరోసారి దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కోవిడ్ మార్గదర్శకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కరోనా మార్గదర్శకాలు అమయ్యేలా చూడాలని అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసుల పెరుగుదల.... అత్యధిక పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. హై-పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని ఆదేశించారు.