తాలిబన్ల రాకతో అప్రమత్తమైన భారత వాయుసేన ఆయుధ సంపదను పెంపొందించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. అర్జంటుగా రష్యా నుంచి 70వేల ఏకే-103 రైఫిళ్లను కొనుగోలుకు ఆర్డర్ చేసేసింది. ఈ రైఫిళ్లు కొన్ని నెలల్లోనే ఐఏఎఫ్ చేతికి అందనున్నాయి. మొత్తం 70వేల ఏకే-103 రైఫిళ్లను రష్యా నుంచి గతవారం అత్యవసరంగా కొనుగోలు చేసింది ఇండియా. ఈ కాంట్రాక్టు విలువ రూ. 300కోట్లు ఉంటుందట.