డ్రగ్స్ కోసం ఎవరు ఎంత చెల్లించారు.. లావాదేవీలు ఏ రూపంలో జరిగాయి.. ఆన్లైన్ లావాదేవీలైతే.. విదేశాలకూ నగుదు వెళ్లిందా.. అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఓ సినీప్రముఖుడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న సమాచారం వస్తోంది. అప్పట్లో పబ్ నిర్వహించిన ఓ సినీ ప్రముఖుడు విదేశాల నుంచి భారీగా డ్రగ్స్ తెప్పించాడన్న ప్రచారం ఉంది.