డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకులంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా ఆయన క్రీడలపై ఆసక్తికర కామెంట్ లు చేశారు. క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ధర్మాన వ్యాఖ్యానించారు. ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ధర్మాన కోరారు. వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది తన భావన అంటూ ధర్మాన చెప్పారు. క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను..క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. సమాజం పట్ల గౌరవం, క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.