కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పీఆర్ టీయూ కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది ఒక మంచి దృక్పథం అంటూ ఓటర్లకు హితబోద చేశారు. పీఆర్సీని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని హరీష్ రావు అన్నారు. కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగిందని అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కు ఒక్కసారి పీఆర్సీని ఏడున్నర శాతం ఇస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల కే 30 శాతం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఎక్కువ జీతాలు, పీఆర్సీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అంటూ హరీష్ రావు అన్నారు.