రాజకీయాల్లో అదృష్టం కలిసిరాకపోతే ఎలాంటి నాయకుడుకైన గెలుపు అంతా త్వరగా రాదనే చెప్పొచ్చు. నాయకులకు కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటేనే గెలుపు దక్కుతుంది. కానీ రాజకీయాల్లో ఎన్ని సార్లు కష్టపడినా అదృష్టం కలిసిరాక వరుసగా ఓటమి పాలవుతున్న నాయకుల్లో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు.