చింతమనేని ప్రభాకర్...ప్రతిపక్ష టిడిపిలో ఫైర్ బ్రాండ్ నాయకుడు...అలాగే ఏపీలో ఎక్కువసార్లు అరెస్ట్ అయిన టిడిపి నాయకుడు కూడా ఈయనే. వైసీపీ అధికారంలోకి వచ్చాక, వరుసపెట్టి జైలుకెళుతూనే ఉన్నారు. అలా అని చింతమనేని పెద్ద పెద్ద అక్రమాలు చేసి జైలుకెళ్లడం లేదని, వైసీపీ ప్రభుత్వం కావాలని కేసులు పెట్టి ఇరికించేస్తుందని టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాజాగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పి చింతమనేని ఆందోళన కార్యక్రమం చేశారు.