విశాఖ స్టీల్ ప్లాంట్...ఏపీకి గర్వకారణం...అందులో ఎలాంటి అనుమానం లేదు. విశాఖ హక్కు...ఆంధ్రుల హక్కు అంటూ...స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన సందర్భం కూడా ఉంది. అలా ఆంధ్రా ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి, కేంద్రం ప్రయివేటీకరణ చేయాలని చూస్తోంది. ఇందులో వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని పలుమార్లు స్పష్టం చేసింది.