కర్నూలు జిల్లా బనగానపల్లె రాజకీయాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టిడిపి కూడా ఎదుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టిడిపి నాయకుడు బిసి జనార్ధన్ రెడ్డిల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. గత రెండు ఎన్నికల నుంచి ఈ ఇద్దరు నాయకులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి జనార్ధన్ పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డిపై గెలిచారు. పైగా టిడిపి అధికారంలోకి రావడంతో ...ఆ ఐదేళ్లు బిసి హవా నడిచింది.