ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే లోకేష్‌లో చాలా మార్పు వచ్చిందని సొంత పార్టీ వాళ్లే కాదు...ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు సైతం మాట్లాడుకుంటున్నారు. లోకేష్ మాట తీరు చాలా వరకు మారింది...ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా లోకేష్ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్రంలో సమస్య ఉన్నచోటుకల్లా వెళ్ళి, ఆ సమస్యపై పోరాటం చేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నారు.