ఏపీలో రాజధాని రగడ రగులుతూనే ఉంది. ఎప్పుడైతే సిఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారో అప్పటినుంచి ఏపీలో రాజధానిపై రచ్చ జరుగుతుంది. 2014లో రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రాష్ట్రం మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దీనికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ సైతం ఒప్పుకున్నారు. అలాగే అమరావతిని రాజధానిగా ప్రకటించడంపై మిగతా ప్రాంతాల నుంచి ఎలాంటి వ్యతిరేకత కూడా రాలేదు. తమకు రాజధాని కావాలని ఎవరు ఆందోళనలు చేయలేదు.