అసలే తప్పుల తడకగా నిర్ణయాలు తీసుకున్న అమెరికా చివరకు సైన్యం నిష్క్రమణ విషయంలోనూ తప్పులే చేసింది. దీని కారణంగా ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటోంది. అఫ్గానిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తీరు అమెరికాకే అవమానకరంగా ఉందని ట్రంప్ వంటి నేతలు మండిపడుతున్నారు.