అఫ్గాన్ నుంచి వివిధ రంగాల్లో నిపుణులు ఇప్పుడు అఫ్గాన్ వదిలి వెళ్లిపోతున్నారు. టెక్నికల్ పీపుల్ దేశం విడిచి వెళ్తున్నారు. ఈ మేధావుల వలసను అడ్డుకోలేకపోతే.. ముందు ముందు అఫ్గాన్‌లో మేధావులే ఉండరు. ఇప్పటికే అఫ్గాన్‌లోని అనేక మంది వివిధరంగాల ప్రముఖులను బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు వీరు తక్కువ వేతనానికే పని చేస్తారు కాబట్టి వీరి తెలివితేటలు వారికి అవసరం. అలా మేధావులు వలస వెళ్లిపోతున్నారు కాబట్టి .. వారిని ఆపేందుకు తాలిబన్లే ఈ దాడులు చేయించారని అనేక అమెరికన్ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.