ఇప్పుడు చైనాకు మరో చిక్కు వచ్చిపడింది. తాము భారత్తో సత్సంబంధాలు పెట్టుకుంటామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు. దీంతో తన అంచనాలు తప్పుతున్నాయనే భావనలో చైనా ఉంటోంది. దీనికి తోడు ఇండియా కూడా సై అంటే సై అంటూ దేనికైనా సిద్ధంగా ఉండటం చైనాను కలవరపరుస్తోంది. ఇప్పుడు ఈ మలబార్ విన్యాసాలు నిర్వహించడం కూడా చైనాకు కడుపుమంటగానే తోస్తుంది. మొత్తానికి చైనా విషయంలో మాత్రం భారత్ ఏమాత్రం తగ్గట్లేదని చెప్పాలి.