ఇప్పుడు ఏపీలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది.. ఏపీ పాలనా వ్యవస్థలో ఎక్కడ ఏ వ్యవస్థపై ఫిర్యాదు చేయాల్సి వచ్చినా.. ఆ కేసుల్లో సీఎం జగన్, మంత్రులు ప్రతివాదులు అవుతున్నారు. అధికారులస్థాయి నిర్ణయాలపై కూడా సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేరుస్తున్నారు. ఇలా వందలు, వేల కేసుల్లో సీఎం జగన్ ప్రతివాదిగా ఉంటున్నారు. తాజాగా ఈ అంశంపై హైకోర్టులో ఆసక్తికమైన చర్చ కూడా జరిగింది.