ఏపీలో అత్యధిక బలంతో వైసీపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి 151 ఎమ్మెల్యేల బలం ఉండగా, టిడిపి, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కూడా కౌంట్ చేస్తే...156 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే ప్రతిపక్ష టిడిపికి కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వైసీపీకి బలం ఉందని చెప్పొచ్చు. అయితే ఇంత బలం ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్తితి ఎదురుకునే అవకాశాలున్నాయని తాజాగా వస్తున్న పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన మళ్ళీ వైసీపీకే అధికారం దక్కుతుందని, కానీ 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ మాత్రం రాదని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో మునుపటి కంటే ప్రతిపక్ష టిడిపి పుంజుకుంటుందని వివరిస్తున్నాయి.