ఒంగోలు పార్లమెంట్ టిడిపిలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి టిడిపి ఇప్పుడుప్పుడే బయటపడుతుంది. కీలకమైన స్థానాల్లో టిడిపి ఇప్పుడుప్పుడే పికప్ అవుతుంది. అయితే ఇదే సమయంలో టిడిపిలో నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టిడిపి నాయకుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.