ఇంతకాలం మౌనంగా ఉన్న వైసీపీ మళ్లీ జోరు చేస్తోంది. సౌండ్ కూడా ఒక్క లెక్కన పెంచుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయిపోయింది. తొలి ఏడాదితో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని వైసీపీ పెద్దలు గర్వంగా చెప్పేవారు. మూడు రాజధానులు ఏపీలో ఏర్పాటు చేస్తామని కూడా వారు నాడు ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. అయితే దూకుడుతో తీసుకున్న ఆ నిర్ణయం కాస్తా న్యాయ వివాదంలో పడింది. వందలాది పిటిషన్లు మూడు రాజధానులకు వ్యతిరేకంగా పడ్డాయి. ఆ విచారణ జరిగి తీర్పు వచ్చేనాటికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది.