రఘురామకృష్ణంరాజు....వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి..అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకుడు. వరుసపెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేత. ఇక ఇలా తమని ఇబ్బంది పెడుతున్న రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే రఘురామ, వైసీపీల మధ్య ఉన్న వార్ని పక్కనబెడితే, వచ్చే ఎన్నికల్లో రఘురామ పాత్ర ఎలా ఉండనుందనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎలాగో రఘురామకు వైసీపీ టికెట్ ఇవ్వదు. రఘురామ సైతం మళ్ళీ వైసీపీ వైపుకు వెళ్లారు.