ఏపీలో ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రం చేస్తున్నాయి. అధికార వైసీపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష టిడిపి, ప్రతిరోజూ వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. ప్రజా సమస్యలపై కూడా టిడిపి నేతలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇటీవల రోడ్లు దెబ్బతినడంపై నిరసన తెలియజేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు.