విశాఖపట్నంలో మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు. జిల్లాలో పలు నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టిడిపికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా ఒకటి. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు ఎలమంచిలిలో టిడిపి జెండా ఎగిరింది.