నిక్కీ హేలీ ఏం చెబుతున్నారంటే.. అఫ్గానిస్థాన్లో కీలకమైన బగ్రామ్ వైమానిక స్థావరంలో చైనా తిష్ఠ వేసే అవకాశం ఉందట. ఆ తర్వాత పాకిస్తాన్ను ఉపయోగించుకుని భారత్కు వ్యతిరేకంగా చైనా పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అందుకే జిత్తుల మారి చైనాను ఓ కంట కనిపెట్టాలని నిక్కీ హేలీ అంటున్నారు.